Ayesha Khan : టాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ బిగ్‌బాస్ భామ.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి..

హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిన్న రిలీజయిన శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో గ్లామర్ రోల్ చేసింది అయేషా ఖాన్.

Ayesha Khan : టాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ బిగ్‌బాస్ భామ.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి..

Bollywood Bigg Boss Fame Ayesha Khan Trending in Tollywood with Om Bheem Bush Movie

Ayesha Khan : ఎవరి సమయం ఎప్పుడొస్తుందో ఎవ్వరికి తెలీదు. ఇక సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో తెలీదు. కొంతమంది ఎన్నేళ్లు కష్టపడినా రాని గుర్తింపు ఓవర్ నైట్ లో వచ్చేస్తుంది. కొంతమందికి మొదటి ఛాన్స్ కే వచ్చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ట్రెండింగ్ అవుతారో కూడా చెప్పడం కష్టమే. ఇప్పుడు బాలీవుడ్ భామ అయేషా ఖాన్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ముంబైకి చెందిన ఈ భామ బాలీవుడ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తూనే సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకొని పలు బాలీవుడ్ టీవీ షోలలో పాల్గొంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తెలుగులోనే ప్రయాణం మొదలుపెట్టింది అయేషా ఖాన్. తెలుగులో ముఖచిత్రం అనే సినిమాలో ఓ పాత్ర చేసింది. నిన్న రిలీజయిన శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో గ్లామర్ రోల్ చేసింది అయేషా ఖాన్. ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా నటించింది. ఈ ఒక్క సినిమాతో, ఈ సినిమాలో తన గ్లామర్ రోల్ తో అయేషా ఖాన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. నిన్నటి నుంచి అయేషా ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Chiranjeevi : తమ్ముడి బర్త్ డేని దగ్గరుండి సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అంటూ..

ఇక నేడు విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో అయేషా ఖాన్ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ తో మెప్పించనుంది. ఈ ప్రోమోతో వైరల్ అవుతుండగానే పింక్ కలర్ శారీలో క్యూట్ గా ఫోటోలు షేర్ చేసి బాగా వైరల్ అవుతుంది అయేషా ఖాన్. ఏకంగా ట్విట్టర్ ట్రెండింగ్ లో అయేషా ఖాన్ ఉందంటే ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో తెలుస్తుంది. తెలుగు యువత అయేషా ఖాన్ అందాలకి బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నారు. త్వరలో దుల్కర్ సల్మాన్ సినిమా లక్కీ భాస్కర్ లో కూడా అయేషా ఖాన్ నటిస్తుందని సమాచారం. ఇదే హవా కొనసాగిస్తే తెలుగులోనే అయేషా ఖాన్ కచ్చితంగా బిజీ స్టార్ అవుతుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి మున్ముందు ఇంకే రేంజ్ లో తన అందాల ఆరబోతతో సినిమాల్లో మెప్పిస్తుందో చూడాలి.