నా జీవితంలో ప్రత్యేకం.. అమ్మ జన్మదినం..

ఘట్టమనేని ఇందిరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు..

ఘట్టమనేని ఇందిరమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అనే సంగతి తెలిసిందే. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో  ఉన్న అనుబంధాన్ని, భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో గడిపే సమయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.

నేడు మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా, ‘నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అయిన అమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తల్లితో కలిసి ఉన్న ఫోటోను మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.

భార్య నమ్రత, ఇందిరా దేవి రేర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి విషెస్ తెలిపారు. మహేష్ సోదరి మంజుల కూడా శుభాకాంక్షలు తెలియచేశారు. మహేష్ బాబుకి ఇందిరమ్మతో అందరి కంటే కాస్త అనుబంధం ఎక్కువేనని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.