Mahesh Babu invests in nutrition startup Fitday
Super star Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతోనే కాకుండా పలు బిజినెస్‌లతో కూడా సంపాదిస్తున్నారు. ఇప్పటికే పలు రకాల బిజినెస్‌లు.. AMB సినిమాస్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్, క్లాతింగ్ వంటి వాటిల్లో సూపర్ స్టార్ పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఆయన మరో రంగంలో అడుగుపెట్టారు. పోషకాహార వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
ఫిట్‌డే అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్‌బాబు పెట్టుబడి పెట్టారు. ఈ విషయాన్ని సదరు కంపెనీ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అయితే.. ఎంత పెట్టుబడి పెట్టారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఫిట్ డే ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మిల్లెట్స్ ఫుడ్ తయారు చేసే కంపెని. మహేశ్ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడంతో ఈ కంపెనీ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు.
Devara Trailer : ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్.. రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. గూస్‌బంప్స్ అంతే..
ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి అయిందని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Bezawada Bebakka : అమెరికాలో కోటి రూపాయల జాబ్ వదులుకొని.. బిగ్ బాస్‌కి వచ్చిన బెజవాడ బేబక్క..