Mahesh Babu
Mahesh Babu: కాస్త గ్యాప్ వస్తే చాలు టాలీవుడ్ హీరోలు ఈమధ్య ఫారెన్ చెక్కేస్తున్నారు. ఫ్యామిలీలో మెమొరబుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అసలే భార్యాపిల్లలకు బాగా ప్రియారిటీ ఇచ్చే సూపర్ స్టార్ బ్రేక్ వస్తే ఊరుకుంటారా.. టైట్ షెడ్యూల్ సెట్ చేసుకుని మరీ విహారయాత్రకు ప్లాన్ చేసారు. మరి సర్కారు వారి సంగతేంటి.. ఆ తర్వాత ప్రాజెక్ట్ పరిస్థితేంటి.. ఇంతకీ ఈ సూపర్ ఫ్యామిలీ వెళ్లేదెక్కడికి? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో డిస్కషన్ గా మారింది.
Mahesh Babu: మాస్ అవతారమెత్తిన మహేష్ బాబు.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
సినిమా సినిమాకి బ్రేక్ తీసుకోవడం సూపర్ స్టార్ అలవాటు. ఇప్పుడలాగే సర్కారు వారి పాట ఫైనల్ సాంగ్ కాగానే సమ్మర్ ట్రిప్ కి మహేశ్ ప్లాన్ చేశారు. కోవిడ్ టైమ్ లో.. సర్కారు వారి పాట షూటింగ్ టైమ్ లోనూ ఫ్యామిలీకి దగ్గరగానే మహేశ్ గడిపారు. ఫారెన్ షూటింగ్ లోకెషన్స్ కు కూడా నమ్రతతో పాటూ పిల్లలని తీసుకెళ్లారు. అయితే ఈసారి షూటింగ్ టెన్షన్ లేకుండా ప్రీ బర్డ్స్ లా విహరించాలని మహేశ్ ఫ్యామిలీ అనుకుంటోంది. అందులో భాగంగానే సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేయబోతుంది.
Mahesh Babu : మహేష్ జాబితాలోకి మరో ఖరీదైన కారు..
ప్రస్తుతం సర్కారు వారి పాట ఫైనల్ సాంగ్ షూట్ జరుగుతోంది. మహేశ్, కీర్తి సురేశ్ జంటపై ఓ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ పాటకు సంబంధించి షూటింగ్ లోకేషన్ ఫోటోలను కూడా మూవీ యూనిట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. మహేశ్ తన పార్ట్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఇంకా ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే ఈ నెల 22 వరకు పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేసారు. సో ఆ తర్వాత పూర్తి టైమ్ ను మహేశ్ తన ఫ్యామిలీతో గడుపనున్నారు. సమ్మర్ ట్రిప్ తర్వాత సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొంటారు సూపర్ స్టార్.
Mahesh Babu: సర్కారు వారి పాటను ముగించే పనిలో మహేష్!
మూవీ వాయిదాపడుతుందనే పుకార్లు పుట్టుకొచ్చినా వాటిని కొట్టిపారేసారు మేకర్స్. సర్కారు వారి పాట ఎట్టి పరిస్థితుల్లో మే 12నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక త్రివిక్రమ్ తో మహేశ్ బాబు చేయబోతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుంది. పూజా హెగ్డే లేడీ లీడ్ గా కనిపించబోతున్న ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పట్టుకుని రెడీగా ఉన్న త్రివిక్రమ్ సూపర్ స్టార్ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు.