Mahesh Babu : మహేష్ కోసం ఒకరు కాదు ముగ్గురు వెయిటింగ్.. బాబు ఎవరికీ ఓకే చెప్తాడో?
మహేష్ నెక్స్ట్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. (Mahesh Babu)
- Saketh U
- Published on- June 18, 2026 / 10:48 AM IST
Mahesh Babu
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ కథతో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఏంటి అనే చర్చ మొదలయింది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ పడుతుందని, ఇది అందరి హీరోలకు జరిగిందని తెలిసిందే.
అందుకే మహేష్ నెక్స్ట్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే మహేష్ తో సినిమా చేయడానికి ముగ్గురు దర్శకులు రెడీగా ఉన్నారట. ఒకటి సందీప్ రెడ్డి వంగ. సందీప్ ఇప్పటికే మహేష్ కి కథ చెప్పాడని, ఆ కథకు డెవిల్ అనే టైటిల్ పెట్టారని టాక్ వినిపిస్తుంది. సందీప్ వంగ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉంది.
Also Read : Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ.. సమంత సినిమా టాక్ ఏంటి?
మరో దర్శకుడు బుచ్చిబాబు సాన. ఇటీవలే పెద్ది సినిమాతో పెద్ద హిట్ కొట్టిన బుచ్చిబాబు మహేష్ బాబుతో ఓ మైథలాజి కథ తీయాలనుకుంటున్నట్టు, ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ జరిగిందని ఇటీవల పెద్ది ప్రమోషన్స్ లో తెలిపాడు. మహేష్ బాబు ఓకే అంటే బుచ్చిబాబు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.
మరో దర్శకుడు అనిల్ రావిపూడి. ఆల్రెడీ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి హిట్ కొట్టాడు. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అనే నమ్మకం తప్పించుకోవాలంటే అనిల్ రావిపూడి కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. హైప్ లేకుండా చిన్న సినిమాగా సింపుల్ కథతో నవ్విస్తూ ఫ్యామిలీలు కూడా వచ్చేలా అనిల్ రావిపూడి సినిమా చేస్తాడని అందరి నమ్మకం. రాజమౌళి లాగే అనిల్ రావిపూడి కూడా ఫ్లాప్స్ లేకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.
Also See : Vithika Sheru : ఊయలలో తెలుగింటి అందం.. చీరకట్టులో వితిక షేరు.. ఫొటోలు..
మరి అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సాన.. ఈ ముగ్గురు దర్శకులలో మహేష్ బాబు రాజమౌళి వారణాసి సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.
