Tollywood Diwali : సింగిల్ ఫ్రేమ్‌లో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్..
తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
- Saketh U
- Updated on- November 12, 2023 / 12:31 PM IST
Mahesh Babu NTR Ram Charan Venkatesh Photo From Diwali Party by Ram Charan Upasana Couple
Tollywood Diwali : టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
ఈ పార్టీకి టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ – నమ్రత దంపతులు, ఎన్టీఆర్- ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మి.. ఇలా పలువురు వచ్చి సందడి చేశారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ పార్టీ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Unstoppable With NBK : బాలీవుడ్ మీట్స్ బాలయ్య.. ఆహా అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ అనౌన్స్..
దీంట్లో ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అలాగే ఉపాసన, నమ్రత, ప్రణతి ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్ అంటే అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
