×
Ad

Mahesh- Rajamouli: పొట్టు పొట్టు కొట్టుకున్న మహేష్, రాజమౌళి.. ఎంత పనిచేశావ్ వర్మ

మహేష్ బాబు, రాజమౌళి(Mahesh- Rajamouli) కాలర్ పట్టుకొని కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahesh babu, rajamouli fight sequence video created by Ai

Mahesh- Rajamouli; రోజురోజుకి టెక్నాలజీ అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. అడ్వాన్సుడ్ టెక్నీక్స్ యూజ్ చేస్తూ ఆడియన్స్ ను తమ మాయలో పడేస్తున్నారు మేకర్స్. ఇక సినిమా రంగంలో అయితే ఈ టక్నాలజీ వాడకం అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. లేని లోకాలను ఉన్నట్టుగా క్రియేట్ చేసి అది నిజమా, అబద్దమా అని మనల్ని మనమే మోసం చేసుకునేలా చేస్తున్నారు దర్శకులు.

Kirrak Seetha: క్రేజీ లుక్ లో కిర్రాక్ సీత.. బ్లాక్ టాప్ లో గ్లామర్ కెవ్వు కేక.. ఫొటోలు

తాజాగా అలాంటిదే ఒకటి క్రియేట్ చేసి టాలీవుడ్ ఆడియన్స్ ను మాయలో పడేశాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం Ai వాడకం అనేది ప్రతీ ఇండస్ట్రీలో సాధారణం అయిపొయింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువగానే వాడేస్తున్నారు. అసలు కొంతమందైతే Ai తో సినిమాలు కూడా తీసేస్తున్నారు. అచ్చం మనుషులగానే ఉండే సరికి ఆడియన్స్ కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈనేపథ్యంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి(Mahesh- Rajamouli) కాలర్ పట్టుకొని కొట్టుకున్నట్టుగా ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ వీడియోను Ai ఎక్స్ పర్ట్స్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వీడియోకి సినిమా ఐస్ డెడ్ అనే క్యాప్షన్ ను ఇచ్చాడు. అంటే రానున్న రోజుల్లో భారీ ఖర్చు, పనితనం అవసరం లేకుండానే Aiతో మాయలు చేయొచ్చు అనేది అయాన్ ఉద్దేశం అయ్యుండొచ్చు అని వీడియో చూసిన వారు చెప్తున్న మాట. ఏదిఏమైనా మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకుంటున్నటుగా ఉన్న ఆ వీడియో మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయనుంది అనే చెప్పాలి