Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమాకు ఆషాఢం అడ్డొచ్చిందా?

సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకున్నా రోజూ ఏదో ఒక వార్త మహేష్ - రాజమౌళి సినిమా గురించి వినిపిస్తూనే ఉంది.

Mahesh Babu Rajamouli Movie will Start after Aashada Masam Rumours goes Viral

Mahesh Babu – Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రెండేళ్ల క్రితం 2022లోనే చెప్పారు. కానీ అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం. సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతున్నా అప్డేట్స్ కాదు కదా కనీసం షూటింగ్ మొదలు పెట్టడం, పూజా కార్యక్రమాలు చేయడం కూడా లేదు. దీనిపై మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

మామూలుగానే రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్లు దాటుతుంది. ఇక ఇప్పటికే సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు, ఇంకా సినిమా మొదలే కాలేదు కాబట్టి ఇంకో మూడేళ్లు వేసుకున్నా సినిమా అనౌన్న్ చేసిన ఐదేళ్లకు అయినా సినిమా రిలీజ్ అవుతుందా అని సందేహిస్తున్నారు. సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకున్నా రోజూ ఏదో ఒక వార్త మహేష్ – రాజమౌళి సినిమా గురించి వినిపిస్తూనే ఉంది.

Also Read : Ram Charan : అంబానీ ఇంట పెళ్ళికి రామ్ చరణ్..? టాలీవుడ్ నుంచి ఒక్కడే..

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో వైపు మహేష్ బాబు సినిమాకు కావాల్సిన లుక్ కోసం జుట్టు, గడ్డం పెంచుకొని రెడీ అవుతున్నాడు. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాని ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

తాజా సమచారం ప్రకారం ఆల్రెడీ మహేష్ – రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకున్నా ప్రస్తుతం ఆషాడ మాసం అడ్డొచ్చిందట. సాధారణంగా ఆషాఢమాసంలో మంచి ముహుర్తాలు ఉండవని, కొత్త పనులు ఏవి మొదలుపెట్టరని అంటారు. ప్రస్తుతం జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఇది అయ్యాక సినిమాని అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెడతారని ఇండస్ట్రీ టాక్. ఎలాగో మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న ఉండటంతో ఆ రోజు మంచి ముహూర్తం ఉంటే మొదలుపెడదామని లేదా ఆషాఢ మాసం అయ్యాక మంచి ముహూర్తం చూసుకొని మొదలుపెడదామని మూవీ యూనిట్ అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు