Mahesh Babu
Mahesh Babu : సినిమాల్లో ఒకరు చేయాల్సిన పాత్ర పలు కారణాలతో ఇంకొకరికి వెళ్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమలో ఇది సర్వ సాధారణమే. అలా రాజీవ్ కనకాల చేయాల్సిన ఓ పాత్ర మరొకరికి వెళ్ళింది. రాజీవ్ కనకాలకు ప్రతి సినిమాలో తన పాత్రని చంపేస్తున్నారు. దీంతో రాజీవ్ పాత్ర అంటే సినిమాలో ఆయన కచ్చితంగా చనిపోయే పాత్రే అని ఫిక్స్ అయ్యారు అంతా. దీనిపై కొన్నాళ్ళు సోషల్ మీడియాలో సరదా ట్రోలింగ్ కూడా జరిగింది.(Mahesh Babu)
రాజీవ్ కనకాల కూడా మీడియా ముందు తనకు అన్ని చనిపోయే పాత్రలే తెస్తున్నారని, చనిపోని పాత్రలు ఉంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అన్నారు కూడా. దీనిపై నటుడు అజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అజయ్ పోకిరి సినిమాలో మహేష్ బాబు పక్కన ఫ్రెండ్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే అజయ్ కి స్టార్ డమ్ వచ్చింది. అయితే ఆ పాత్ర రాజీవ్ కనకాల చేయాలంట.
Also Read : Bunny Vasu : చిరంజీవి భార్యకు బాకీ ఉన్న బన్నీ వాసు.. 20 ఏళ్ళ క్రితం తీసుకొని.. ఎంతో తెలుసా?
నటుడు అజయ్ మాట్లాడుతూ.. పోకిరి సినిమాలో నా పాత్ర రాజీవ్ కనకాల చేయాలి. ‘అతడు’ సినిమాలో ఆల్రెడీ రాజీవ్ ది చనిపోయే పాత్ర కదా మళ్ళీ అదే రిపీట్ అయి ఇందులో కూడా చనిపోయే పాత్ర అయితే బాగోదు అని మహేష్ గారే నన్ను పూరి జగన్నాధ్ కి సజెస్ట్ చేసారు అని తెలిపాడు. పోకిరి సినిమాలో అజయ్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. అతడు సినిమాలో రాజీవ్ కనకాల కేవలం 5 నిమిషాలే ఉంటాడు. ఆ పాత్రని చంపేస్తారు. అలా మళ్ళీ పోకిరిలో కూడా చనిపోయే పాత్రే అని రాజీవ్ కనకాలను వద్దన్నారట మహేష్.
దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల చనిపోయే పాత్రలు అప్పట్నుంచే చేస్తున్నారని, మహేష్ ముందే గుర్తించి ఒక సినిమాలో చనిపోకుండా కాపాడాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా రాజీవ్ కి మిస్ అయిందని అంటున్నారు.