Mahesh Babu : కృష్ణ కోప్పడిన సందర్భం.. భార్యని ఎలా మ్యానేజ్ చేయాలో చెప్పిన మహేష్..
'యానిమల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మహేష్ బాబు మాట్లాడుతూ.. కృష్ణ కోప్పడిన సందర్భం, భార్యని ఎలా మ్యానేజ్ చేయాలో అని విషయాలను తెలియజేశారు.
- gum 95921
- Published On : November 28, 2023 / 12:28 PM IST
Mahesh Babu shares anger moments with Krishna and Namrata Shirodkar
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు స్టార్సే. ఇక ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే బాండ్ కూడా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. కృష్ణ-మహేష్, నమ్రతా-మహేష్, ఘట్టమనేని వారసులు సితార, గౌతమ్‌తో మహేష్.. ఇలా కొడుకుగా, భర్తగా, తండ్రిగా మహేష్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తాజాగా మహేష్ కొన్ని రహస్యాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. రీసెంట్ గా మహేష్ ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌తో పాటు భార్యాభర్తల బంధం గురించి కూడా చూపించబోతున్నారు. దీంతో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్‌ని ఇలా ప్రశ్నించారు.. ‘కృష్ణ గారు మిమ్మల్ని కోప్పడిన సందర్భం ఒకటి చెప్పండి’ అంటూ అడిగారు. మహేష్ బదులిస్తూ.. “అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో చూపించినంత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను చూడలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ‘భర్తలు భార్యలను ఎలా మ్యానేజ్ చేయాలి అనే విషయంలో ఏమైనా టిప్స్ ఇస్తారా..?’ అని ప్రశ్నించారు.
Also read : DeepFake Video : అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో.. అసలు తప్పు వాళ్లదే అంటున్న నెటిజెన్స్..
దానికి మహేష్ బదులిస్తూ.. “భర్తలు ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు. ఏ సందర్భం అయినా నవ్వుతూ ఉండండి. మ్యానేజ్ చేయడానికి అది ఒక్కటే దారి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫైనల్ గా SSMB29 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయినా అప్డేట్ ఇవ్వండి అంటూ ప్రశ్నించగా.. రాజమౌళి చెప్పిన సమాధానమే చెప్పారు. ఆ సినిమాకి ఇంకా సమయం ఉందంటూ సింపుల్ రిప్లై ఇచ్చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రాజమౌళితో సినిమా పట్టాలు ఎక్కనుందని సమాచారం.
