Sitara : సితార నన్నెప్పుడూ గర్వంగానే ఉంచుతుంది.. సితార క్లాసికల్ డ్యాన్స్ షేర్ చేస్తూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా సితార మరో అమ్మాయితో కలిసి ఓ క్లాసికల్ డ్యాన్స్ చేయగా ఆ వీడియోని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సితార అద్భుతంగా క్లాసికల్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా సితారని అభినందిస్తున్నారు.............

Sitara :  మహేష్ బాబు కూతురిగా సితారకి మంచి ఫేమ్ ఉంది. తండ్రికి తగ్గట్టే సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాకి ఓ ప్రమోషనల్ సాంగ్ లో కూడా యాక్ట్ చేసింది. సితార యాక్టింగ్ కి, తన మాటలకి, డ్యాన్సులకి చాలా మంది అభిమానులు ఉన్నారు. సితార కూడా తన రకరకాల ట్యాలెంట్స్ చూపిస్తూ అందరిని ఫిదా చేస్తుంది.

తాజాగా సితార మరో అమ్మాయితో కలిసి ఓ క్లాసికల్ డ్యాన్స్ చేయగా ఆ వీడియోని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సితార అద్భుతంగా క్లాసికల్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా సితారని అభినందిస్తున్నారు.

Mehar Ramesh : కచ్చితంగా పవర్ స్టార్‌తో నా సినిమా ఉంటుంది

ఈ వీడియోని మహేష్ షేర్ చేసి.. సితార నువ్వు నన్ను ఎప్పుడూ గర్వపడేలాగే చేస్తావు. ఇలాగే కొనసాగించు. తనకి ఇంత అద్భుతంగా డ్యాన్స్ నేర్పించిన మహతి భిక్షు, అరుణ భిక్షు గారికి చాలా థ్యాంక్స్. అందరికి హ్యాపీ దివాళీ” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సితార డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు