Guntur Kaaram : గుంటూరు కారం అప్డేట్ వచ్చేసింది.. మహేష్ కి ముద్దు పెట్టిన శ్రీలీల..
తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
- Saketh U
- Published on- December 9, 2023 / 05:21 PM IST
Mahesh Babu Sreeleela Guntur Kaaram Movie Second Song Update by Movie Unit
Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా మీనాక్షి చౌదరి(Meenaakshi Chaudhary), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో మూడో సినిమాగా అవస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా 2024 సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్.
ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, దమ్ మసాలా అని సాగే ఓ పాటని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి సెకండ్ పాట రిలీజ్ కాబోతుందని థమన్, నిర్మాత నాగవంశీ, శ్రీలీల హింట్స్ ఇచ్చారు. తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
మహేష్ బాబుకి బుగ్గ మీద శ్రీలీల ముద్దు పెడుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసి.. ఓ మై బేబీ అని సాగే పాట ప్రోమో డిసెంబర్ 11న సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు, ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ సాంగ్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.
