Mahesh Babu
Mahesh Babu: నేనా.. హిందీ సినిమానా.. నో వే అన్నారు. కానీ ఇప్పుడు.. వేర్ దేర్ ఈజ్ ఏ – విల్ దేర్ ఈజ్ ఎ వే అంటున్నారు మహేశ్ బాబు. తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుంటే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తే ప్రసక్తే లేదన్న సూపర్ స్టార్.. హిందీ మేకర్స్ కథలు కూడా వినేస్తున్నారు. అసలేంటి కథ.. మహేశ్ ను మెప్పించిన బాలీవుడ్ డైరెక్టర్ ఎవరన్నది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
Mahesh Babu: గ్యాప్ దొరికింది.. ఫ్యామిలీతో ఎగిరిపోయిన సూపర్ స్టార్!
త్వరలో మహేశ్.. బాలీవుడ్ డైరెక్టర్ కి ఎస్ చెప్పినా ఆశ్చర్యం లేదు. ఆ మేరకు బాలీవుడ్ మేకర్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అవును బాలీవుడ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరేట్ డైరెక్టర్ సూరజ్ భర్జత్య.. టాలీవుడ్ సూపర్ స్టార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్యే ఆయన మహేశ్ భార్య నమ్రతను కలిసి స్టోరీ నేరేట్ చేసారని.. ఇటు నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అందాయని తెలుస్తోంది.
Mahesh Babu: మాస్ అవతారమెత్తిన మహేష్ బాబు.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కోన్, హమ్ సాత్ సాత్ హైన్, వివాహ్ లాంటి సినిమాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు సూరజ్ భర్జత్య. సల్మాన్ తో చేసిన ప్రేమ్ రతన్ ధన్ పాయో ఈయన చివరి సినిమా. ప్రస్తుతం ఊన్చాయ్ మూవీ చేస్తున్నారు. ఈయన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడీ డైరెక్టర్ తో మహేశ్ సినిమా అంటే సౌత్ టు నార్త్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు పండుగే. ముంబయి సెలెబ్రటీస్ తో ర్యాపో మెయింటైన్ చేస్తోన్న నమ్రతా వల్లే ఇది సాధ్యం అవుతుందని చెప్తున్నారు.
Mahesh Babu : ఒకే రోజు 30 మంది చిన్నారులకి ప్రాణం పోసిన మహేష్..
సూరజ్ భర్జత్య, మహేశ్ కాంబోనే కాదు.. బాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ తో సినిమాలు చేసేందుకు క్రేజీ డైరెక్టర్ కొందరు క్యూ కడుతున్నారు. డైరెక్ట్ గా మహేశ్ కి చెప్పలేక.. నమ్రతకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కానీ బాబు ఆలోచనలే వేరుగా ఉన్నాయి. డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేసేందుకు మొదటి నుంచి ఆసక్తి లేని మహేశ్.. ఈమధ్య కూడా చేయనన్నట్టే మాట్లాడారు. కానీ ఇప్పుడంతా పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి.. తెలుగులోనే చేసి బాలీవుడ్ రిలీజ్ చేసుకుంటామని చెప్తున్నారమో నార్త్ డైరెక్టర్స్. మరి మహేశ్ డెసిషన్ ఎలా ఉండబోతుందో ముందు ముందు తెలుస్తుంది.