Mahesh Babu To Play CM Again: మహేష్ బాబు మళ్లీ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఎప్పటినుండో మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
- Anil Aaleti
- Published On : August 18, 2022 / 09:34 PM IST
Mahesh Babu To Play CM Again In Sekhar Kammula Movie
Mahesh Babu To Play CM Again: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా పట్టాలెక్కకముందే, రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేసుకుంది. వచ్చే ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి సినిమా చేయబోతున్నాడు. కాగా, మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఎప్పటినుండో మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. శేఖర్ కమ్ముల మహేష్ బాబుతో చేయబోయే సినిమా గతంలో వచ్చిన ‘లీడర్’ చిత్రానికి సీక్వెల్ అని తెలుస్తోంది. యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘లీడర్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో లీడర్ 2 చిత్రాన్ని తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడట.
Mahesh Babu : మహేష్ బర్త్ డే స్పెషల్.. మహేష్ చేసే సేవా కార్యక్రమాలు..
ఇక ఈ సినిమాలో మరోసారి మహేష్ సీఎం పాత్రలో అలరించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా మహేష్ సీఎం పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అదే పాత్రలో మరోసారి శేఖర్ కమ్ముల సినిమాను తెరకెక్కించాలని చూస్తుండటంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల నిజంగానే మహేష్‌తో లీడర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
