Mahesh Babu : మహేష్ బర్త్ డే స్పెషల్.. మహేష్ చేసే సేవా కార్యక్రమాలు..

సినిమాల్లో తన క్లాస్, మాస్ యాక్షన్ తో అదరగొడుతూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి ఎంతోమంది అభిమానులకి ఫేవరేట్ హీరోగా మారాడు. తన ఎవర్ గ్రీన్ అందంతో ఎంతోమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు మహేష్ బాబు. తన తండ్రి వారసత్వాన్ని తీసుకొని........

Mahesh Babu : మహేష్ బర్త్ డే స్పెషల్.. మహేష్ చేసే సేవా కార్యక్రమాలు..

Mahesh babu social service

Mahesh Babu :  సినిమాల్లో తన క్లాస్, మాస్ యాక్షన్ తో అదరగొడుతూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించి ఎంతోమంది అభిమానులకి ఫేవరేట్ హీరోగా మారాడు. తన ఎవర్ గ్రీన్ అందంతో ఎంతోమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు మహేష్ బాబు. తన తండ్రి వారసత్వాన్ని తీసుకొని కేవలం సినిమాల్లో స్టార్ డం సంపాదించడమే కాక తన తండ్రిని మించి సేవా కార్యక్రమాల్లో రియల్ హీరోగా ఎదిగాడు. నేడు ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ సూపర్ స్టార్ కి బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నారు.

మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో జీవితాలని ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఆయన చేసే కొన్ని సేవా కార్యక్రమాలు..

*2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

*అంతేకాక ఆ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.

*మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటివరకు దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మహేష్ ని దేవుడిగా చూస్తారు.

*గుండె సమస్య ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది వచ్చినా తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తానని ప్రకటించారు.

*హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా రూ.2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు. ఇలా ఎన్నో సార్లు ప్రభుత్వాలకు కష్టకాలంలో ప్రజల కోసం సహాయాన్ని అందించాడు.

*తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా స్పెషల్ డేస్ లో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తారు మహేష్.

*అంతేకాక తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా మహేష్ అవసరమైన సహాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ దగ్గర పనిచేస్తున్న వారే చెప్పారు.

Rajinikanth: రాజకీయాల్లోకి ఎంట్రీపై రజనీకాంత్ మరో కీలక ప్రకటన

ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా మహేష్ సహాయపడుతూ, ఎంతోమంది ప్రాణాలని కాపాడుతూ సినిమాల్లోనే కాక రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

Mahesh babu social service