Guntur Kaaram : సంక్రాంతికి రమణ గాడి జాతర.. మూడు రోజుల్లో గుంటూరు కారం కలెక్షన్స్ ఎన్ని కోట్లు?

మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం హిట్ టాక్ తో ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Three Days Collections Details

Guntur Kaaram Collections :మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి థియేటర్స్ లో సందడి చేస్తుంది. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలతో పండక్కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మెప్పిస్తుంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం హిట్ టాక్ తో ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

ఈ సంక్రాంతికి మరో మూడు సినిమాలు ఉన్నా గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ లో జోరు చూపిస్తుంది. గుంటూరు కారం సినిమా మొదటి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండో రోజుకి అది 127 కోట్లకు చేరింది. ఇక మూడో రోజు దాదాపు 37 కోట్లు కలెక్ట్ చేసి గుంటూరు కారం సినిమా మొత్తంగా మూడు రోజుల్లో 164 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతొచ్చాయో తెలుసా?

ఇంకా సంక్రాంతి హాలీడేస్ జనవరి 18 వరకు ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. గుంటూరు కారం సినిమా ఆల్మోస్ట్ 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పండగ సెలవులు కావడంతో ఫ్యామిలీలతో మహేష్ బాబు సినిమా కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు.