Mahesh Babu: ఏ వేడుక అయినా అమ్మ ఉండాల్సిందే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె మృతిపట్ల మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె మృతిపట్ల మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Mahesh Babu: ఒకే ఏడాదిలో మహేష్ ఇంట రెండు విషాదాలు..!

కాగా, మహేష్‌కు తన తల్లి అంటే ఎంత ప్రేమ ఉందో ఆయన పలు వేదికలపై వెల్లడించారు. తనకు తల్లి తరువాతే ఎవరైనా అని.. ఆమె తనకు భగవంతుడితో సమానం అంటూ పలుమార్లు ఎమోషనల్ అయ్యాడు మహేష్. అయితే మహేష్, తన కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పార్టీలు జరిగినా తన తల్లిని చేయి పట్టుకుని మరీ తీసుకెళ్లేవాడు. ఇలా తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు అనేకం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఎలాంటి వేడుకలైనా తన తల్లితో కలిసి మహేష్ వెళ్లడంతో ఆయనకు తన తల్లిపై ఎంత ప్రేమ ఉందనే విషయం తెలుస్తోంది.

Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

మహేష్ తల్లి మృతిచెందడంతో ఆయన తన తల్లి గురించి చెప్పిన కొన్ని విషయాలకు సంబంధించిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహేష్‌కు ఈ కష్టకాలంలో ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలంటూ వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.

నాన్-స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు