Mahesh Babu : ‘వారణాసి’లో మహేష్ బాబు డూప్ ఇతనేనా? మహేష్ బాడీ డబుల్ వైరల్..

తాజాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు డూప్ ఇతనే అని పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Mahesh Babu)

  • Published on- October 22, 2026 / 04:48 PM IST

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. అక్టోబర్ ఎండింగ్ కి వారణాసి మెయిన్ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని తెలుస్తుంది.

మన స్టార్ హీరోలకు బాడీ డబుల్స్ ఉంటారని, కొన్ని యాక్షన్ సీక్వెల్స్, హీరో అందుబాటులో లేనప్పుడు కొన్ని సీన్స్ కి, షోల్డర్ షాట్స్ కి బాడీ డబుల్స్ ని వాడతారని తెలిసిందే. చాలా మంది హీరోలు వాళ్ళే సొంతంగా నటించి గాయాల పాలయినా కొన్ని సీన్స్ లో డూప్ లను వాడక తప్పదు. తాజాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు డూప్ ఇతనే అని పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Ranabaali : ‘రణబాలి’ రణభేరి.. రాయలసీమ గడ్డ మీద సక్సెస్ మీట్.. ఎప్పుడు? ఎక్కడ?

వారణాసి సినిమాలో మహేష్ కి బాడీ డబల్ గా నటిస్తున్న ఈ నటుడి పేరు రోషన్ బొగాటి (అలియాస్) బాల్. ఇతను ముంబై కి చెందిన మోడల్, నటుడు. మిస్టర్ ఇండియా కూడా సాధించాడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. తెలుగులో పాడేరు 12వ మైలు, యమునా నది, పెన్ డ్రైవ్ అనే సినిమాల్లో నటించాడు. మహేష్ బాబు మౌంటెన్ డ్యూ యాడ్ లో కూడా మహేష్ కి డూప్ గా ఇతనే నటించాడు.

ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమాలో మహెష్ బాబు కి డూప్ గా నటిస్తున్నాడు. షూటింగ్ సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఫైట్ మాస్టర్.. పలువురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. దీంతో మహేష్ డూప్ అంటూ ఈ రోషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.