×
Ad

Mahesh Babu : సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్..

మహేష్ తన ట్వీట్ లో.. ''ఏపీ సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చెప్పిన సమస్యలను విని, వాటి గురించి ఆలోచించి ఆ సమస్యలకి పరిష్కారంగా సినిమా టికెట్ రేట్లని సవరించి........

  • Published On : March 9, 2022 / 02:22 PM IST

Mahesh

 

Mahesh Babu :  గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల అంశంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు టాలీవుడ్ ప్రముఖులు పలు సార్లు సీఎం జగన్ ని, మంత్రి పేర్ని నానిని కలిసి టాలీవుడ్ సమస్యలని వివరించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ సమస్యలకి ముగింపు పలుకుతూ సినిమా టికెట్ రేట్లను ఓ మోస్తరుగా పెంచుతూ కొత్త జీవోని విడుదల చేసింది. ఇందుకు ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సీఎం జగన్‌కి, పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి.. లాంటి స్టార్లు ట్వీట్లు చేయగా మరికొంతమంది ప్రముఖులు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Rajamouli : ఏపీ సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ట్వీట్..

మహేష్ తన ట్వీట్ లో.. ”ఏపీ సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చెప్పిన సమస్యలను విని, వాటి గురించి ఆలోచించి ఆ సమస్యలకి పరిష్కారంగా సినిమా టికెట్ రేట్లని సవరించి కొత్త జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మున్ముందు ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య మంచి సపోర్ట్, అండర్ స్టాండింగ్ ఉండాలని కోరుకుంటున్నాను” అని మంత్రి నానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.