Major Glimpse : ‘మేజర్’ గ్లింప్స్ వదిలిన మహేష్.. టీజర్ ఎప్పుడంటే..

26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Major Glimpse Teaser On 28th March

Major Glimpse: 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్నారు.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది టీం.

మేజర్ సందీప్‌ని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ‘మేజర్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. మార్చి 28న ఈ సినిమా టీజర్ విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే : అడవి శేష్, స్క్రిప్ట్ గైడెన్స్, డైలాగ్స్ : అబ్బూరి రవి, హిందీ డైలాగ్స్ : అక్షత్ అజయ్ శర్మ, కెమెరా : వంశీ పచ్చిపులుసు, సంగీతం : శ్రీ చరణ్ పాకాల.