NTR Neel Video: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ సర్ ప్రైజ్.. టీజర్ కి ముందే స్పెషల్ వీడియో.. మ్యూజిక్ అదిరిపోయిందిగా!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(NtrNeel) సినిమా గురించి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 03:36 PM IST
Makers released a special video from ntr neel movie dragon
- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో
- అర్ధరాత్రే పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల
- రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజిక్
NTR Neel Video: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ రెట్టింపయింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఒకరోజు ముందే అంటే మే 19 అర్ధరాత్రి 11:52 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు.
ఈ కీలక అప్‌డేట్‌కు ముందే చిత్రబృందం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో గ్లింప్స్(NtrNeel) ఏ ఏ భాషల్లో, ఏ ఏ యూట్యూబ్ ఛానల్స్‌లో స్ట్రీమింగ్ కానుందో స్పష్టంగా వివరించారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో రాబోతున్న ఈ టీజర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ప్రత్యేక వీడియోలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆయన మార్క్ అదిరిపోయే రీ-రికార్డింగ్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అదిరిపోయే మ్యూజిక్ బిట్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తూ, టీజర్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
These are the grounds where the destruction protocol activates 🔥#NTRNeel First Glimpse today at 11:52PM IST. pic.twitter.com/xs9SeBLvBp
— #NTRNeel (@NTRNeelFilm) May 19, 2026
