Malaika Arora reacted to the breakup news
Malaika Arora : బాలీవుడ్ భామ మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బీటౌన్ లో పలు ఐటమ్ సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మొదట సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత పలు వ్యక్తిగత కారణాల వల్ల ఆయనతో విడాకులు తీసుకుంది. అనంతరం హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది.
కానీ గత కొద్ది రోజుల నుండి వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల ముంబయిలోని దివాళీ బాష్‌కు వెళ్లారు అర్జున్ కపూర్. అక్కడ మలైకా అరోరా గురించి కొందరు అడిగారు. దానికి సమాధానమిచ్చిన అర్జున్ కపూర్ తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది.
Also read : Sahil Salathia : భుజాలపై మండుతున్న కొవ్వత్తులతో సాహిల్ సలాథియా స్టన్నింగ్ ఫొటోస్..
తాజాగా ఆయన మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు.. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ తన మనసులో మాటను బయటపెట్టింది మలైకా. దీంతో వీరిద్దరూ విడిపోయారన్న క్లారిటీ వచ్చింది. ఇప్పుడే కాదు గతంలో కూడా మలైకా ఇటువంటి పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఇటువంటి పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.