Premalu : తెలుగులో బిగ్గెస్ట్ మలయాళ మూవీగా ‘ప్రేమలు’ రికార్డు.. కలెక్షన్స్ ఎంతంటే..

తెలుగులో ఇప్పటివరకు డబ్ అయ్యిన మలయాళ చిత్రాల్లో 'ప్రేమలు' రికార్డు.

Malayala Block Buster Love Story Premalu Movie Telugu collections report

Premalu : ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు కంటే చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. కేవలం పది కోట్లు, ఇరవై కోట్ల లోపు బడ్జెట్స్ తో వచ్చి 100 కోట్లు కలెక్షన్స్ నమోదు చేస్తూ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘ప్రేమలు’. నస్లెన్ గఫూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

ఫిబ్రవరిలో కేవలం మళయాళంలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం.. 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇతర పరిశ్రమ మేకర్స్ ని ఆకర్షించింది. దీంతో ఈ సినిమా పై రాజమౌళి తనయుడు కార్తికేయ చూపు పడింది. ఇంకేముంది వెంటనే డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకొని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ట్రైలర్ తో తెలుగు యువతని బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం.. థియేటర్స్ లో లవ్ అండ్ కామెడీతో అలరించింది.

Also read : Nithiin : హిట్ కోసం మళ్ళీ అదే దర్శకుడినే నమ్ముకుంటున్న నితిన్..

పాజిటివ్ టాక్ రావడం, రాజమౌళి అండ్ మహేష్ బాబు కూడా ఈ సినిమా పై కామెంట్స్ చేయడంతో.. థియేటర్స్ లో కలెక్షన్స్ మోత మోగింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.10.54 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగులో ఇప్పటివరకు డబ్ అయ్యిన చిత్రాల్లో ఇవే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అంటూ మూవీ టీం తెలియజేసింది. ప్రస్తుతానికి ఈ మూవీ కలెక్షన్స్ జోరు ఇంకా కొనసాతూనే ఉంది. మరి ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళకు చెందిన హీరో ఒక పెళ్లిలో హీరోయిన్ కలుసుకుంటాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడిన హీరో.. హీరోయిన్ కోసం హైదరాబాద్ వెళ్తాడు. ఇక తన ప్రేమని గెలిపించుకోవడం కోసం తన మిత్రులతో కలిసి హీరో చేసే ప్రయత్నాలు అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసాయి. ముఖ్యంగా హీరోయిన్ మమిత బైజు తన యాక్టింగ్ తో తెలుగు అబ్బాయిలని ప్రేమలో పడేసారు.