Nithiin: యంగ్ హీరో నితిన్ లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ హీరో. కాగా, తన తాజా చిత్రాన్ని రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త కూడా బయటకు రాకుండా చూస్తున్నారు.
Nithiin: సక్సెస్ కోసం ఆ పండగను నమ్ముకున్న నితిన్.. నిజమేనా?
అయితే, ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ గతకొంత కాలంగా తర్జనబర్జన పడుతూ వస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఓ మలయాళ నటుడుని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సుదేవ్ నాయర్ అనే మలయాళ యాక్టర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా స్టైలిష్‌గా ఉండబోతుందని.. ఇలాంటి పాత్రలో సుదేవ్ నాయర్ పర్ఫెక్ట్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Nithiin: ‘సైతాన్’గా మారుతున్న నితిన్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
ఇక ఈ సినిమాలో నితిన్ కూడా మరోసారి స్టైలిష్ లుక్‌లోకి మారుతున్నాడు. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా, శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.