Nithiin: సక్సెస్ కోసం ఆ పండగను నమ్ముకున్న నితిన్.. నిజమేనా?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన నెక్ట్స్ మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.

Nithiin: సక్సెస్ కోసం ఆ పండగను నమ్ముకున్న నితిన్.. నిజమేనా?

Nithiin Vakkantham Vamsi Movie To Release At This Time

Nithiin: యంగ్ హీరో నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేశాడు. ఇటీవల తన కెరీర్‌లో ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే, ఈ సినిమా కంటే ముందే మరొక సినిమాను పూర్తి చేసే పనిలో నితిన్ ఉన్నాడు.

Nithiin Birthday: హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సేవా కార్యక్రమాలు.. ఫోటోలు..

దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ మూవీని సైలెంట్‌గా స్టార్ట్ చేశాడు నితిన్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను వక్కంతం వంశీ సరికొత్త కథతో తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దసరా సీజన్‌లో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, వినాయక చవితి కానుకగా తమ సినిమాను రిలీజ్ చేయాలని నితిన్ అండ్ టీమ్ భావిస్తోందట.

Nithiin: ‘సైతాన్’గా మారుతున్న నితిన్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఆ సమయంలో సినిమాలు తక్కువగా రిలీజ్ అవుతాయని.. దీంతో తమ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్ర టైటిల్‌ను త్వరలోనే అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.