×
Ad

Esther Anil : తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న దృశ్యం పాప.. నిర్మాత కొడుకుతో ఎస్తర్ అనిల్..

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఎస్తర్ అనిల్.

  • Published On : April 3, 2024 / 11:48 AM IST

Malayalam Child Artist Esther Anil now Turned as Heroine with Telugu Movie

Esther Anil : మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసింది ఎస్తర్ అనిల్. దృశ్యం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయింది. మలయాళం, తెలుగులో దృశ్యం 1, 2 సినిమాల్లో ఎస్తర్ అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. దీంతో తెలుగు వారికి కూడా దగ్గరయింది. దాదాపు 25 కి పైగా మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాల్లో ఎస్తర్ అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కాస్తా ఇప్పుడు ఆర్టిస్ట్ అయింది.

ఎస్తర్ అనిల్ ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాల కోసం చూస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఎస్తర్ అనిల్. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా, ఎస్తర్ అనిల్ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం అయింది. సాహిదేవ్ విక్రమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు. గతంలో హీరోగా ఓ సినిమాతో వచ్చాడు.

Also Read : Tillu Square : ఇదే ఊపు కొనసాగితే టిల్లు గాడు 100 కోట్లు కొట్టేస్తాడు.. ఇప్పటికి ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?

ఇటీవల ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు నిర్మాతగా నక్కిన నేరేటివ్స్ నిర్మాణంలో MV కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరగగా సుమంత్, సందీప్ కిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఎస్తర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.