Mammootty : సినీ పరిశ్రమలో మరో విషాదం.. స్టార్ హీరో తల్లి కన్నుమూత..

నిన్న గురువారం నాడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూయగా నేడు మరో విషాదం నెలకొంది. మళయాలం స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మరణించారు.

Malayalam Star Hero Mammootty mother Fatima Ismail Passes away

Mammootty :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. నిన్న గురువారం నాడు బాలీవుడ్(Bollywood) స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా(Aditya Chopra) తల్లి పమేలా చోప్రా(Pamela Chopra) కన్నుమూయగా నేడు మరో విషాదం నెలకొంది. మళయాలం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) తల్లి ఫాతిమా ఇస్మాయిల్(Fatima Ismail) మరణించారు.

మలయాళంలో స్టార్ హీరోగా ఎదిగిన మమ్ముట్టి వేరే భాషల్లో కూడా అనేక సినిమాలు తీశారు. త్వరలోనే అఖిల్ ఏజెంట్ సినిమాతో మమ్ముట్టి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతలోనే మమ్ముట్టి ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ 93 ఏళ్ళ వయసులో మరణించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ నేడు ఉదయం కన్నుమూశారు.

Pamela Chopra : బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. యశ్ చోప్రా భార్య, ఒకప్పటి సింగర్ పమేలా చోప్రా కన్నుమూత..

దీంతో దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మమ్ముట్టి తల్లికి నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మలయాళ ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు మమ్ముట్టి ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరో. దుల్కర్ నానమ్మ మరణించడంతో దుల్కర్, మమ్ముట్టిలకు ప్రముఖులు, అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.