Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..

కొన్ని రోజుల క్రితం జైనబ్‌ రవ్జీ ప్రగ్నెంట్ అయిందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. (Nagarjuna)

Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..

Nagarjuna

Updated On : December 17, 2025 / 8:31 AM IST

Nagarjuna : నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఇటీవల జూన్ లో త‌న ప్రియురాలు జైనబ్‌ రవ్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. అఖిల్ – జైనబ్ జంట ఫొటోలు పెళ్లి సమయంలోను, తర్వాత వెకేషన్ ట్రిప్స్ నుంచి వైరల్ అయ్యాయి.(Nagarjuna)

అయితే కొన్ని రోజుల క్రితం జైనబ్‌ రవ్జీ ప్రగ్నెంట్ అయింది, తల్లి కాబోతుందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై అఖిల్ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా దీనిపై నాగార్జున స్పందించాడు.

Also Read : Balakrishna – Pawa Kalyan : బాలయ్య వల్లే OG రిలీజయింది.. తమ్ముడు పవన్ కి ఇచ్చేదామన్నారు.. బోయపాటి కామెంట్స్..

నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఓ మీడియా ప్రతినిధి.. మీరు తండ్రి నుంచి తాత గా ప్రమోట్ అవుతున్నారా అది నిజమేనా? సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అడిగారు.

దీనికి నాగార్జున నవ్వేసి.. సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అని సమాధానమిచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాను అనడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడా అని రూమర్ మరింత బలంగా వినిపిస్తుంది.

Also Read : Gurram PaapiReddy : హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వస్తే ఎవరో అనుకున్నా.. బ్రహ్మానందం కామెంట్స్..