Gurram PaapiReddy : హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వస్తే ఎవరో అనుకున్నా.. బ్రహ్మానందం కామెంట్స్..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Gurram PaapiReddy)
Gurram PaapiReddy
Gurram PaapiReddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మాణంలో మురళి మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డార్క్ కామెడీ కథతో తెరకెక్కిస్తున్న గుర్రం పాపిరెడ్డి డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను నవ్వించాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Gurram PaapiReddy)
ఈ ఈవెంట్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. గుర్రం పాపిరెడ్డి సినిమాలో కథను ప్రేక్షకులకు తెలియజేసే ఒక జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. యోగిబాబుతో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. నేను సెట్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. డైరెక్టర్ డిఫరెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అని అన్నారు.
Also Read : Pawan Kalyan : ఆ బాధ్యత మీదే అన్న సీఎం చంద్రబాబు.. నిమిషాల్లో పని పూర్తిచేసిన డిప్యూటీ సీఎం పవన్..
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నాకు ప్రొడ్యూసర్స్ కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు నిర్మాతలు. తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలని అందరం ఎఫర్ట్స్ పెట్టాం అని అన్నారు. నిర్మాత అమర్ బురా మాట్లాడుతూ.. ఈ సినిమాతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మా డైరెక్టర్ అన్నారు. చెప్పినట్లే ట్రైలర్ తోనే ప్రూవ్ చేశాడు. మా కాంబినేషన్ జర్నీ ఆగదు. ఇకపై కూడా కలిసి సినిమాలు చేస్తాం. బ్రహ్మానందం గారు ప్రతి సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ సినిమా ఎలా వస్తుందంటూ ఫోన్ చేసి అడిగేవారు. యోగి బాబు గారి డేట్స్ దొరకడం కష్టం. ఆయన కోసం రెండు నెలల వెయిట్ చేశాం అని అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సినిమాలో సౌధామిని పాత్రలో కనిపిస్తాను. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను అని తెలిపింది. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ఇందులో మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తా. ఓల్డ్ ఏజ్ గెటప్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అని తెలిపారు.
