Jabardasth Venkey : అందుకే జబర్దస్త్ మానేశా.. మనుసు చంపుకొని వెళ్ళను.. జబర్దస్త్ షోపై వెంకీ సంచలన కామెంట్స్..
జబర్దస్త్ మానేసిన తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ జబర్దస్త్ షో నుంచి ఎందుకు వెళ్లిపోయాడో తెలిపాడు. (Jabardasth Venkey)
Jabardasth Venkey
Jabardasth Venkey : జబర్దస్త్ లో రెగ్యులర్ గా ఏదో ఒక మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. సీనియర్ కమెడియన్స్ ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. ఇటీవల జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ వెంకీ కూడా మానేసాడు. మిమిక్రీ, వెంట్రలాక్విజంతో జబర్దస్త్ లోకి ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ ఆ తర్వాత వెంకీ మంకీ టీమ్ తో టీమ్ లీడర్ గా చాన్నాళ్లు స్కిట్స్ చేసాడు.(Jabardasth Venkey)
తాజాగా జబర్దస్త్ మానేసిన తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ జబర్దస్త్ షో నుంచి ఎందుకు వెళ్లిపోయాడో తెలిపాడు.
Jabardasth Venkey
జబర్దస్త్ వెంకీ మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచే నేను జబర్దస్త్ మానేసాం. నేను పదేళ్లుగా టీమ్ లీడర్ గా చేసా. చాలా స్కిట్స్ గెలిచా. కానీ నేను అనుకున్నంత పేరు రాలేదు నాకు. ఎందుకో అర్ధం కాలేదు. జబర్దస్త్ ని నేనే ఈగోతో వదిలేసాను. నాది, తాగుబోతు రమేష్ అన్న కలిసి మంచి టీమ్. చాలా స్కిట్స్ గెలిచాం. కానీ ఒకసారి కారణం చెప్పకుండా మీరు ఒక షెడ్యూల్ ఆగండి, స్కిట్ చేయొద్దు అన్నారు. ఎందుకు అంటే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మూడు షెడ్యూల్స్ తర్వాత చూద్దాం అన్నారు. మేము బాగానే చేస్తున్నాం కదా అని అడిగినా ఏదో మార్పులు చేస్తున్నాం అన్నారు.
సరే అని మూడు వారాలు ఆగాము. తర్వాత ఇంకో రెండు వారాలు కూడా పిలవలేదు. ఒక అయిదు వారాలు తర్వాత వాళ్ళు రమ్మని కాల్ చేసారు కానీ నేనే బిజీ ఉన్నాను అని చెప్పి వెళ్లలేదు. ఇంక అక్కడ్నుంచి మానేశా. జబర్దస్త్ మీటింగ్ పెట్టినప్పుడు అందరు టీమ్ వైజ్ రేటింగ్స్ కూడా తీస్తారు. మా టీమ్ టాప్ 3 లో ఉన్నా నెక్స్ట్ డే నే మా టీమ్ ని ఆపేసారు. జనాలు చూస్తున్నా, రేటింగ్ వచ్చినా వాళ్ళు మమ్మలి తీసేసారు. ఆ విషయంలోనే నేను, తాగుబోతు రమేష్ బాగా హర్ట్ అయ్యాం.
Also Read : Alekhya Harika : తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదం.. అయిదేళ్ల తర్వాత స్పందించిన దేత్తడి హారిక..
అక్కడ అందర్నీ టెస్ట్ చేస్తారు. మమ్మల్ని ఆప్షన్ గా చూశారు. అది మాకు నచ్చలేదు. నేను ఉన్నాను అంటే జబర్దస్త్ వల్లే. నన్ను జబర్దస్త్ వల్లే గుర్తుపడతారు. జబర్దస్త్ నాకు పేరు తెచ్చింది, ఫుడ్ ఇచ్చింది కానీ అక్కడ ఉన్న కొంతమంది వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. నా దగ్గర ట్యాలెంట్ లేకపోతే ఇన్నాళ్లు ఉండను. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేసారో తెలీదు. కొత్తవాళ్లు వస్తున్నారు కాబట్టి పాత వాళ్ళను పక్కన పెట్టరేమో. నేను మనుసు చంపుకొని మాత్రం జబర్దస్త్ కి వెళ్ళను. మేము మల్లెమాలను మా సొంత సంస్థలా అనుకుంటున్నాము కానీ ఆ సంస్థ మా ఆర్టిస్టులు అని అనుకోవట్లేదు అన్నాడు.
దీంతో వెంకీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి వెంకీ మంకీ టీమ్ ని ఎందుకు పక్కన పెట్టారో జబర్దస్త్ నుంచి ఎవరైనా వెంకీ చేసిన కామెంట్స్ పై స్పందిస్తారేమో చూడాలి.
