Alekhya Harika : తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదం.. అయిదేళ్ల తర్వాత స్పందించిన దేత్తడి హారిక..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అలేఖ్య హారిక ఆ వివాదం గురించి మాట్లాడుతూ.. (Alekhya Harika)
Alekhya Harika
Alekhya Harika : యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, కామెడీ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక తర్వాత బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అలేఖ్య హారిక సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ బిజీగానే ఉంది. హారిక చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా అలేఖ్య హారిక ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా గతంలో జరిగిన తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదంపై స్పందించింది.(Alekhya Harika)
ఓ అయిదేళ్ల క్రితం అప్పటి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అలేఖ్య హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. అయితే దానిపై విమర్శలు వచ్చాయి. అలాగే అప్పటి టూరిజం మినిస్టర్ కి కూడా ఈ విషయం తెలియదని వార్తలు వచ్చాయి. ఈ తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియామకం వివాదంగా మారడంతో అలేఖ్య హారిక ఆ పోస్ట్ నుంచి తప్పుకుంది.
Also Read : Mokshagna : బాలయ్య తనయుడు మోక్షజ్ఞ రీసెంట్ లుక్స్ చూశారా..? టీడీపీ ఎమ్మెల్యేతో మీటింగ్.. ఫొటోలు వైరల్..
Alekhya Harika
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అలేఖ్య హారిక ఆ వివాదం గురించి మాట్లాడుతూ.. అయిదేళ్ల క్రితం సంఘటన అది. నేను తెలంగాణ అమ్మాయి అని నన్ను వాళ్ళు తీసుకున్నారేమో. అక్కడ ఏదో చిన్న మిస్ కమ్యూనికేషన్ అయింది. నేను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను అని నాకు లెటర్ ఇచ్చారు. నాకు అక్కడ ఏం జరిగిందో కరెక్ట్ గా తెలియదు. లోపల ఆ శాఖలో ఏదో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. నన్ను పిలిచి లెటర్ ఇచ్చారు. తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేయాలి అని అర్థమైంది. కానీ ఒక రెండు రోజుల తర్వాత నేను పెట్టిన పోస్ట్ లో కామెంట్స్ చదువుతుంటే నాకు ఇచ్చిన పోస్టు తీసేసారు కదా అని కామెంట్స్ చేసారు కొంతమంది.
దాంతో ఆ శాఖకు నాతో మాట్లాడించిన మీడియేటర్స్ కి కాల్ చేశాను. వాళ్ళు లోపల ఏదో జరుగుతుంది కానీ మీ పోస్ట్ మీకుంది ఏం కాదు, దీన్ని మేము సాల్వ్ చేస్తున్నాము అని చెప్పారు. తర్వాత నేను షూట్ లో ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నుంచి కాల్స్ చేసి అడుగుతున్నారు. కానీ ఆ టూరిజం శాఖలో నాతో మాట్లాడిన వాళ్ళు మాత్రం నన్ను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. మేము మళ్ళీ చెప్తాము అని అన్నారు. చివరకు నాకు ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్లేమో ఏమి అడిగినా చెప్పట్లేదు. కొంతమంది నువ్వేంటి అప్పుడే టూరిజం బ్రాండ్ అంబాసిడర్ అని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా నాకే అనిపించింది ఇదేదో సమస్య లాగా ఉంది నేనే డ్రాప్ అయితే బెటర్ అని. భవిష్యత్తులో నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే చేద్దాం మంచిగా అనుకోని నేనే ఆ పోస్ట్ నుంచి తప్పుకున్నట్టు మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశాను. అది ఇంక అక్కడితో ముగిసింది అని తెలిపింది.
