Pawan Kalyan : ఆ బాధ్యత మీదే అన్న సీఎం చంద్రబాబు.. నిమిషాల్లో పని పూర్తిచేసిన డిప్యూటీ సీఎం పవన్..
స్టేజిపైనే పవన్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేయడంతో వెంటనే నిమిషాల్లో సభ పూర్తయ్యేలోపే ..(Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సీఎం అమరావతి, ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల అభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు అన్ని చూసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా నూతనంగా నియామకం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాలను అందించే కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత హాజరయ్యారు.(Pawan Kalyan)
ఈ కార్యక్రమంలో కింద స్థాయి నుంచి, గ్రామాల నుంచి వచ్చి సక్సెస్ అయిన పలువురు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన వారిని స్టేజిపైకి పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన బాబురావు అనే యువకుడు స్టేజిపై తమ గ్రామానికి రోడ్డు వేయించాలని సీఎం చంద్రబాబుని అడిగాడు.
Also Read : Alekhya Harika : తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదం.. అయిదేళ్ల తర్వాత స్పందించిన దేత్తడి హారిక..
దీంతో సీఎం చంద్రబాబు.. తన గ్రామం గురించి ఆలోచించిన ఆ అబ్బాయిని అభినందించి.. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇది మీ బాధ్యత. రోడ్డు వేయించే బాధ్యత మీదే. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటికి కనెక్టివిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.
అలా స్టేజిపైనే పవన్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేయడంతో వెంటనే నిమిషాల్లో సభ పూర్తయ్యేలోపే ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేసారు పవన్ కళ్యాణ్. బాబూరావు కోరిక మేరకు, సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి రోడ్డు వేయమని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో అధికారులు తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ కి తెలపగా దాన్ని ఆమోదించారు పవన్. నేటి నుంచే ఈ రోడ్డు పనులు మొదలవ్వాలి అని ఆదేశించారు పవన్.
Also Read : AP TDP : జిల్లాల వారీగా టీడీపీ నూతన అధ్యక్షులు వీరే..? వారికి అధిక ప్రాధాన్యత
పవన్ ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలకు రోడ్డు, కరెంట్, నీటి వసతులు ఇస్తున్నారు. ఇలా ఏకంగా సీఎం అడగడం, అడిగిన వెంటనే పని పూర్తి చేయడంతో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని పవన్ ని మరోసారి అభినందిస్తున్నారు.
