Pamela Chopra : బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. యశ్ చోప్రా భార్య, ఒకప్పటి సింగర్ పమేలా చోప్రా కన్నుమూత..

యశ్ చోప్రా 2012 లోనే మరణించగా తాజాగా అతని భార్య పమేలా చోప్రా గురువారం నాడు కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

Pamela Chopra : బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. యశ్ చోప్రా భార్య, ఒకప్పటి సింగర్ పమేలా చోప్రా కన్నుమూత..

Bollywood singer producer Pamela Chopra passes away

Updated On : April 21, 2023 / 10:06 AM IST

Pamela Chopra :  ఇటీవల సినీ పరిశ్రమలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్(Bollywood) లో యశ్ చోప్రా(Yash Chopra) భార్య, ఒకప్పటి సింగర్ పమేలా చోప్రా(Pamela chopra) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films). దీని అధినేత యశ్ చోప్రా. యశ్ చోప్రా 2012 లోనే మరణించగా తాజాగా అతని భార్య పమేలా చోప్రా గురువారం నాడు కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

పమేలా చోప్రా సింగర్ గా బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం రచయితగా, డిజైనర్ గా కూడా పలు సినిమాలకు పనిచేసింది. సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడింది. యశ్ చోప్రాతో పెళ్లి అనంతరం యశ్ రాజ్ ఫిలిమ్స్ లో నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం కూడా ఆమె నెట్ ఫ్లిక్స్ కోసం ఓ డాక్యుమెంటరీలో నటించింది. గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం సహకరించడంలేదు. సడెన్ గా గురువారం మధ్యాహ్నం ఇంట్లోనే ఆమె మరణించారు.

Jagapathi Babu : పుష్ప 2లో జగపతిబాబు.. అదిరిపోయే అప్డేట్.. ఇంకో విలన్ గానా?

పమేలా చోప్రాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆదిత్య కపూర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేతగా ఉన్నారు. చిన్న కొడుకు ఉదయ్ చోప్రా నటుడిగా, కమెడియన్ గా బాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ పమేలాకు కోడలు. ఆమె ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. పమేలా చోప్రా మరణించిందని తెలియడంతో అమితాబ్, షారుఖ్, సల్మాన్, విక్కీ కౌశల్, కత్రీనా, రణవీర్, దీపికా, హృతిక్, అమీర్ ఖాన్.. ఇలా అనేక మంది బాలీవుడ్ స్టార్స్ వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ముంబైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.