Jabardasth Comedian : వామ్మో ఈ లేడీ గెటప్ ఆర్టిస్ట్ కి 200 కోట్ల ఆస్తా? జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ ఇతనే..

జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ ఇతనా అని ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. (Jabardasth Comedian)

Jabardasth Comedian : వామ్మో ఈ లేడీ గెటప్ ఆర్టిస్ట్ కి 200 కోట్ల ఆస్తా? జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ ఇతనే..

Jabardasth Comedian

Updated On : December 17, 2025 / 10:09 AM IST

Jabardasth Comedian : జబర్దస్త్ షోతో చాలా మంది ఆర్టిస్టులు, కమెడియన్స్ ఫేమ్ తెచ్చుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కొంతమంది కమెడియన్స్ అయితే జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ ఉపయోగించుకొని బయట ఈవెంట్స్, సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఇళ్లులు కట్టుకొని, కార్లు కొనుక్కొని బాగానే ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారు. పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఈ విషయం ఇంటర్వ్యూలలో తెలిపారు.(Jabardasth Comedian)

అయితే జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ ఇతనా అని ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు లేడీ గెటప్స్ తో మెప్పించే కొమరం. జబర్దస్త్ లో కొమరక్క లాగా లేడీ గెటప్స్ తో స్కిట్స్ లో నవ్విస్తాడు. తెలంగాణ స్లాంగ్ తో డైలాగ్స్ చెప్పి అందర్నీ మెప్పిస్తాడు కొమరం. కొమరం తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా మీకు 20 ఎకరాలు పొలం, 200 కోట్ల ఆస్తి ఉందని విన్నాను నిజమేనా అని యాంకర్ అడిగారు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు మామూలోడు కాదు.. శృతి హాసన్ దగ్గర అలీని భలే బుక్ చేసేసాడు..

దీనికి జబర్దస్త్ కొమరం సమాధానమిస్తూ.. అదంతా నేను సంపాదించింది కాదు. మా నాన్న ఇచ్చింది కొంత ఉంది. నేను గతంలో మా మ్యూజిక్, మా గోల్డ్ ఛానల్స్ లో కొన్నేళ్ల క్రితమే యాంకరింగ్ కూడా చేసాను. అప్పట్నుంచే డబ్బులు కూడబెట్టుకున్నాను. మా నాన్న 20 ఎకరాల భూమి ఉంటే 15 ఎకరాలు అమ్మేసి అయిదు ఎకరాలు మిగిల్చాడు. అప్పట్నుంచి నేను ఎలాగైనా భూమి కొనాలి అనుకున్నా. నేను, నా భార్య డబ్బులు అన్ని కూడబెట్టి భూమి, పొలాలు కొన్నాను. అప్పట్లో తక్కువ రేటు ఉన్నాయి. చాలా తక్కువలో కొన్నాను. వాటి విలువ ఇప్పుడు పెరిగింది అంతే. అవి ఉన్నా వాటిని ఏం చేయలేను అని తెలిపారు.

Do You Know who is the Richest Jabardasth Comedian

దీంతో జబర్దస్త్ లో రిచెస్ట్ కమెడియన్ కొమరం అని, అతనికి దాదాపు 200 కోట్ల విలువ చేసే పొలాలు, ఆస్తి ఉందని తెలుస్తుంది.

Also Read : Nagarjuna : 15 ఏళ్ళ నుంచి ఆ సమస్యతో బాధపడుతున్న నాగార్జున.. సర్జరీ వద్దంటూ..