Jagapathi Babu : పుష్ప 2లో జగపతిబాబు.. అదిరిపోయే అప్డేట్.. ఇంకో విలన్ గానా?

తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Jagapathi Babu : పుష్ప 2లో జగపతిబాబు.. అదిరిపోయే అప్డేట్.. ఇంకో విలన్ గానా?

Jagapathi Babu playing an important role in Pushpa 2 Movie

Updated On : April 21, 2023 / 8:20 AM IST

Jagapathi Babu :  ఒకప్పటి హీరో జగపతిబాబు సింహ సినిమా తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అదిరిపోయే విలన్ గా, తండ్రి పాత్రల్లో, స్పెషల్ క్యారెక్టర్స్ తో స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం జగపతిబాబు తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా జగపతిబాబు నేడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో సల్మాన్ విలన్ రోల్ లో నటించారు.

తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జగపతి బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాను. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో నటించడంతో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆయన గొప్ప పాత్రలు ఇస్తారు నాకు. పుష్ప 2లో కూడా మంచి పాత్ర ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. అల్లు అర్జున్ ని మొదటిసారి 20 ఏళ్ళ క్రితం ఓ జిమ్ లో చూశాను. అప్పుడు వెంటనే గుర్తుపట్టలేదు. ఆ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మంచి పాత్రలతో వస్తే ఏ భాషలోనైనా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.

Kisi Ka Bhai Kisi Ki Jaan : 5700 స్క్రీన్స్ లో.. ఏకంగా 100 దేశాల్లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ గ్రాండ్ రిలీజ్ నేడే..

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 లోనే చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2లో మరింత మంది ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పుడు జగపతి బాబు కూడా తాను పుష్ప 2లో ఉన్నాడు అని ప్రకటించడంతో విలన్ రోల్ కా? ఇంకో కొత్త విలనా? లేక మరేదైనా పాత్రకా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.