Kisi Ka Bhai Kisi Ki Jaan : 5700 స్క్రీన్స్ లో.. ఏకంగా 100 దేశాల్లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ గ్రాండ్ రిలీజ్ నేడే..
వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు ఉండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంచనాలు నెలకొన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా నేడు ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan releasing today in 5700 screens at 100 countries
Kisi Ka Bhai Kisi Ki Jaan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ పూజాకు అన్నయ్యగా నటించాడు. అంతే కాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక జగపతిబాబు విలన్ గా నటించాడు. ఇలా చాలా వరకు సౌత్ యాక్టర్స్ నే పెట్టుకొని సౌత్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేసాడు సల్మాన్. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ సొంతంగా తెరకెక్కించడం విశేషం.
తమిళ్ వీరమ్ సినిమాకు రీమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా తెరకెక్కింది. అయినా సినిమాలో చాలా వరకు మార్చి సరికొత్తగా తెరకెక్కించారు. వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు ఉండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంచనాలు నెలకొన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా నేడు ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
కేవలం మనదేశంలోనే 4500 స్క్రీన్స్ లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఒక్కరోజులో 16000 షోస్ తో రిలీజ్ అవుతోంది. మన దేశం బయట ఏకంగా 100 దేశాల్లో దాదాపు 1200 స్క్రీన్స్ లో గ్రాండ్ గా ఈ సినిమా అరిలిజ్ అవుతోంది. మొత్తంగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్స్ లో భారీగా రిలీజ్ అవ్వడం విశేషం. ఈ సినిమాపై సల్మాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల షారుఖ్ పఠాన్ సక్సెస్ తర్వాత ఆ రేంజ్ లో ఇంకే సినిమా బాలీవుడ్ లో హిట్ అవ్వలేదు. మరి సల్మాన్ భాయ్ ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
#Xclusiv… #KisiKaBhaiKisiKiJaan *final* screen count…
⭐ #India: 4500+ [16,000+ shows per day]
⭐️ #Overseas: 1200+ [100+ countries]
⭐️ Worldwide total: 5700+ screens.#KBKJ #SalmanKhan #Eid #Eid2023 pic.twitter.com/C6CvPWyAF9— taran adarsh (@taran_adarsh) April 20, 2023