Virupaksha : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టేసిన విరూపాక్ష.. థియేటర్లలో భయపడుతున్న ప్రేక్షకులు.. ట్విట్టర్ రివ్యూ..

విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Virupaksha : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టేసిన విరూపాక్ష.. థియేటర్లలో భయపడుతున్న ప్రేక్షకులు.. ట్విట్టర్ రివ్యూ..

Sai Dharam Tej Virupaksha Movie twitter Review

Updated On : April 21, 2023 / 11:22 AM IST

Virupaksha :  హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తో రికవర్ అయ్యాక విరూపాక్ష(Virupaksha) సినిమాతో నేడు ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తిని నింపింది. సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇందులో హీరోయిన్ గా నటించగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ కూడా భారీగా చేసిన విరూపాక్ష నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్ షోలు వేశారు. విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగిందని, చాలా బాగా తీశారని, సాయి ధరమ్ తేజ్, సంయుక్త ఇద్దరూ కూడా అదరగొట్టేశారని అంటున్నారు ప్రేక్షకులు.