ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 3 పరీక్షల తేదీల్లో మార్పు.. రివైజ్డ్ షెడ్యూల్ ఇదే..
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే పరీక్ష తేదీ మారింది.
TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ (సివిక్స్) ఎగ్జామ్స్ తేదీ మారింది. మార్చి 3న ఈ మూడు ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. వాటిని మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు.
ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వివరాలు తెలిపారు. హోలీ పండుగ సెలవు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మిగతా పరీక్షలు ముందుగా ప్రకటించినట్లే యథాతథంగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే పరీక్ష తేదీ మారింది. ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను కొన్ని నెలల క్రితమే విడుదల చేసిన విషయం తెలిసిందే.
| తేదీ | సబ్జెక్ట్ |
|---|---|
| ఫిబ్రవరి 25(ఫస్టియర్) | ద్వితీయ భాష |
| ఫిబ్రవరి 26(సెకండియర్) | ద్వితీయ భాష |
| ఫిబ్రవరి 27 (ఫస్టియర్) | ఇంగ్లిష్ |
| ఫిబ్రవరి 28(సెకండియర్) | ఇంగ్లిష్ |
| మార్చి 2 (ఫస్టియర్) | గణితం–1ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ |
| మార్చి 4(సెకండియర్) | గణితం–2ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ |
| మార్చి 5(ఫస్టియర్) | గణితం–1బి, జంతుశాస్త్రం, చరిత్ర |
| మార్చి 6(సెకండియర్) | గణితం–2బి, జంతుశాస్త్రం, చరిత్ర |
| మార్చి 9(ఫస్టియర్) | భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం |
| మార్చి 10(సెకండియర్) | భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం |
| మార్చి 12(ఫస్టియర్) | రసాయనశాస్త్రం, కామర్స్ |
| మార్చి 13(సెకండియర్) | రసాయనశాస్త్రం, కామర్స్ |
| మార్చి 14(ఫస్టియర్) | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు గణితం |
| మార్చి 16(సెకండియర్) | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు గణితం |
| మార్చి 17(ఫస్టియర్) | మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |
| మార్చి 18(సెకండియర్) | మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |
