Best Samsung Phones : మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా? రూ. 25వేల లోపు బెస్ట్ శాంసంగ్ ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

Best Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. 2025లో రూ. 25వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ 5 శాంసంగ్ ఫోన్లు ఇలా ఉన్నాయి..

1/6Best Samsung Phones Under Rs 25000
Best Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. మీరు శాంసంగ్ అభిమాని అయితే రూ. 25వేల లోపు ధరలో కొనుగోలు 5 బెస్ట్ 5G శాంసంగ్ ఫోన్లలో కొనుగోలు చేయొచ్చు. ఇందులో శాంసంగ్ గెలాక్సీ M56, శాంసంగ్ గెలాక్సీ A26, శాంసంగ్ గెలాక్సీ A55, శాంసంగ్ గెలాక్సీ F56, శాంసంగ్ గెలాక్సీ A17 5G ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, కెమెరా సిస్టమ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కొనుగోలుదారులకు అద్భుతమైన ఫోన్లుగా చెప్పొచ్చు. ఇందులో మీకు నచ్చిన శాంసంగ్ 5G ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.
2/6Samsung Galaxy M56
శాంసంగ్ గెలాక్సీ M56 (రూ. 24,999)​ : శాంసంగ్ గెలాక్సీ M56 ఫోన్ 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. క్విక్ రీఛార్జ్ కోసం 45W వైర్డ్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో పాటు 50MP + 8MP + 2MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది.
3/6Samsung Galaxy A26
​శాంసంగ్ గెలాక్సీ A26 (రూ. 22,999) : శాంసంగ్ గెలాక్సీ A26 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. రోజంతా వినియోగానికి 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 13MP ఫ్రంట్ కెమెరాతో పాటు 50MP + 8MP + 2MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
4/6Samsung Galaxy A55
​శాంసంగ్ గెలాక్సీ A55 (రూ. 24,999)​ : శాంసంగ్ గెలాక్సీ A55 ఫ్లూయిడ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 32MP సెల్ఫీ షూటర్‌తో 50MP + 12MP + 5MP ట్రిపుల్-కెమెరా కాన్ఫిగరేషన్‌ కలిగి ఉంది.
5/6Samsung Galaxy F56
​శాంసంగ్ గెలాక్సీ F56 (రూ. 21,999) : శాంసంగ్ గెలాక్సీ F56 ఫోన్ 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ స్క్రీన్‌ డిస్‌ప్లే అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 45W వైర్డ్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే.. 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరాను అందిస్తుంది. 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
6/6Samsung Galaxy A17 5G
శాంసంగ్ గెలాక్సీ A17 5G (రూ. 18,490) : శాంసంగ్ గెలాక్సీ A17 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌తో సపోర్టు ఉన్న 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇమేజింగ్ సెటప్ విషయానికొస్తే.. 50MP + 5MP + 2MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో పాటు 13MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.