మమ్ముట్టికి 68 ఏళ్లా? ఈ ఫిట్‌నెస్ చూస్తే నమ్మడం కష్టమే!

  • Publish Date - August 17, 2020 / 05:18 PM IST

లాక్‌డౌన్ టైం ఎవరికెలా ఉన్నా సెలబ్రిటీలకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే నటీనటులంతా అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని వారికి నచ్చిన పనులు చేస్తూ, నచ్చిన విషయాలు నేర్చుకుంటూ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.



తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. బిజీగా గడుపుతున్నారాయన. ఈ మేరకు ఆదివారం వర్క్‌వుట్‌ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు మమ్ముట్టి.



గ్రే కలర్‌ టీ షర్ట్‌ ధరించి.. జిమ్‌ గ్లవ్స్‌ వేసుకుని ఉన్న ఫొటోలను​.. ‘వర్క్‌ ఎట్‌ హోం.. వర్క్‌ ఫ్రమ్‌ హోం.. హోం వర్క్‌.. నో అదర్‌ వర్క్‌.. సో వర్క్‌వుట్‌’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ వర్గాలవారు ‘68 వయసులో ఇంత బాగా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. మీరు గ్రేట్’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెటిజన్స్ అయితే ‘సూపర్బ్‌.. మీరు యువతకు ఆదర్శం’ అంటూ మమ్ముట్టిని పొగుడుతున్నారు.