MUP Awards 20226:మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్.. ‘మన్యం ధీరుడు’ సినిమాకు ఉత్తమ చిత్ర అవార్డు
ఘనంగా జరిగిన మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ 2026_MUP Awards 20226+.
- V Santhosh Kumar
- Published On : March 28, 2026 / 02:57 PM IST
Malaysian Ugadi Puraskar Awards 2026
MUP Awards 20226: మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో 2026 ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో భాగంగా ఆర్.వి.వి. సత్యనారాయణ నటించి, నిర్మించిన ‘మన్యం ధీరుడు’ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన “మలేషియన్ ఉగాది పురస్కార్ 2026” ఉత్తమ చిత్ర అవార్డు లభించింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం సారథ్యంలో జరిగిన ఈ (MUP Awards 20226)కార్యక్రమంలో క్లాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఆర్.వి.వి. సత్యనారాయణ, శ్రీమతి ఆర్. పార్వతీ దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కారాన్ని అందజేశారు.
Suyodhana Review: ప్రియదర్శి హీరోగా ‘సుయోధన’.. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గాథను ‘మన్యం ధీరుడు’ పేరుతో తెరకెక్కించి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని దేశభక్తి గీతం ప్రతి భారతీయ పౌరుడిలో స్ఫూర్తిని నింపేలా ఉందని ఆయన కొనియాడారు. గౌరవ అతిథులు సుబ్రమణ్యం, రామానాయుడు సహా సుమారు 600 మంది తెలుగు సంఘం సభ్యులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
