×
Ad

Shyam Prasad Reddy : టాలీవుడ్ లో విషాదం.. స్టార్ నిర్మాత భార్య కన్నుమూత..

తాజాగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

  • Published On : August 8, 2024 / 09:15 AM IST

Mallemala Entertainments Head Producer Shyam Prasad Reddy Wife Varalakshmi Passed Away

Shyam Prasad Reddy : అమ్మోరు, అంజి, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి.. లాంటి ఎన్నో సూపర్ హాట్ సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జబర్దస్త్, ఢీ లాంటి పలు సూపర్ హిట్ టీవీ షోలు, సీరియల్స్ నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read : SJ Suryah : ఇదేంటి.. నాని సినిమా స్టోరీ మెయిన్ పాయింట్ చెప్పేసిన SJ సూర్య..

శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి నిన్న రాత్రి మరణించారు. వరలక్ష్మి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న వరలక్ష్మి చికిత్స పొందుతూ 62 ఏళ్ళ వయసులో మరణించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పలువురు టీవీ, సినీ ప్రముఖులు ఆమెకి నివాళులర్పిస్తూ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. ఆవిడ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.