Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..

మంచు లక్ష్మీ నోట.. బాలయ్య ‘అఖండ’ పవర్‌ఫుల్ డైలాగ్స్ వింటే ఎలా ఉంటుంది!..

Lakshmi Manchu

Manchu Lakshmi: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. రెండు టీజర్స్, రెండు లిరికల్ సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

ఇక రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ‘అఖండ ట్రైలర్ రోర్’ పేరుతో వదిలిన ట్రైలర్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్, తన మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టేసారు. ‘అఖండ’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. హైయ్యెస్ట్ వ్యూస్, లైక్స్ సాధించిన సీనియర్ హీరోగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేసారు.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

‘అఖండ’ డైలాగులతో బాలయ్య ఫ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు. అలాగే పలు క్రేజీ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా మంచు లక్ష్మీ తన స్టైల్లో ‘అఖండ’ డైలాగ్స్ చెప్పిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎక్స్‌ప్రెషన్స్‌తో డైలాగ్స్‌కి లిప్ సింక్ బాగానే కష్టపడింది లక్ష్మీ. ఈ వీడియోకు బాలయ్య అభిమానులు మరియు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.