Manchu Lakshmi : ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వండి.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మి వ్యాఖ్యలు..

తాజాగా మంచు లక్ష్మి మంచు మనోజ్ రెండో పెళ్లిపై స్పందించింది. మంచు లక్ష్మిని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి, దానిపై మీరేమంటారు అని అడగడంతో మంచు లక్ష్మి సమాధానమిస్తూ....................

Manchu Lakshmi :  హీరో మంచు మనోజ్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మనోజ్ సినిమాలు కూడా రావట్లేదు, బయట కూడా ఎక్కువగా కనపడట్లేదు మనోజ్. ఇటీవల కొన్ని రోజుల క్రితం వినాయకచవితి సమయంలో మంచు మనోజ్, భూమా మౌనికతో కలిసి ఓ వినాయక మండపంలో పూజలు నిర్వహించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మంచు మనోజ్ కానీ, మౌనిక కానీ, ఆ ఆరెండు ఫ్యామిలీలు కానీ స్పందించలేదు. మధ్యలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వీరిద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనోజ్, మౌనిక గతంలో ప్రేమించుకున్నారని, ప్రస్తుతం వీళ్ళు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయినా ఆ రెండు కుటుంబాల్లో దీనిపై ఎవరూ స్పందించలేదు.

Tamil Directors : టాలీవుడ్ కి పెరిగిన తమిళ డైరెక్టర్ల క్యూ..

తాజాగా మంచు లక్ష్మి మంచు మనోజ్ రెండో పెళ్లిపై స్పందించింది. మంచు లక్ష్మిని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి, దానిపై మీరేమంటారు అని అడగడంతో మంచు లక్ష్మి సమాధానమిస్తూ.. ”ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వండి, అందరి లైఫ్ లోకి ఇలా తలదూర్చకండి, మనోజ్ రెండ్ పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఆనందమే. కానీ ఈ రోజుల్లో నిజాయితీ గల ప్రేమ దొరకట్లేదు. మనోజ్ అలాంటి ప్రేమ పొందితే మంచిదే. నేను మనోజ్ ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాను” అని తెలిపింది. దీంతో ఇండైరెక్ట్ గా మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడని చెప్పినట్టు అర్ధమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు