Tamil Directors : టాలీవుడ్ కి పెరిగిన తమిళ డైరెక్టర్ల క్యూ..

ఇటీవల టాలీవుడ్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. గతంలో కూడా కొంతమంది తమిళ దర్శకులు తెలుగు సినిమాలు చేసినా ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది............

Tamil Directors : టాలీవుడ్ కి పెరిగిన తమిళ డైరెక్టర్ల క్యూ..

Tamil Directors movies with tollywood heros

Tamil Directors :  టాలీవుడ్ క్రేజీ హీరోల్లో చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. అందుకే కొందరు హీరోలు తమిళ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో కనెక్ట్ అయ్యారు. ఇటీవల టాలీవుడ్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. గతంలో కూడా కొంతమంది తమిళ దర్శకులు తెలుగు సినిమాలు చేసినా ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ ను చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి అభిమానుల్ని పూర్తిగా అలరించాడు మోహన్ రాజా. ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో మోహన్ రాజా నెక్స్ట్ నాగ్ అండ్ అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దాంతో పాటు రామ్ చరణ్ తో ధృవ 2 చేస్తానని ఇటీవలే వెల్లడించాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబో. RC15 గా పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇంతలో శంకర్ కు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూట్ చేయాల్సిన బాధ్యత పడడంతో ఆయన అటు షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా యస్.జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ కంప్లీట్ అవగానే RC15 షూటింగ్ తిరిగి స్టార్ట్ కాబోతోంది. ఇది దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో 50వ సినిమాగా రాబోతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముందుగా కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించబోతున్నారు. ఓ తమిళ రీమేక్ ను కూడా చేస్తారని వార్తలొస్తున్నాయి. సముద్రఖని మెయిన్ లీడ్ లో ఆయన దర్శకత్వంలోనే తమిళంలో వచ్చిన ‘వినోదయ చిత్తం’ సినిమాను పవర్ స్టార్ రీమేక్ చేయబోతున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ డేట్స్ ఇచ్చారని, అతి తక్కువ కాల్షీట్స్ లో సినిమాను పూర్తి చేస్తారని టాక్. దీనిని కూడా తమిళ నట దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నారు.

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా తమిళ యాక్షన్ డైరెక్టర్ హరి ఓ సినిమా చేయబోతున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆరు, సింగం సిరీస్, పూజా, ఏనుగు సినిమాలతో హరి టాలీవుడ్ జనానికి సుపరిచితుడే. అలాంటి డైరెక్టర్ తో యాక్షన్ హీరో గోపిచంద్ సినిమా చేయడం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. హరి నెరేట్ చేసిన స్టోరీ గోపీచంద్ ను బాగా ఇంప్రెస్ చేసిందట. మరి ఈ సినిమా గోపీచంద్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పబోతుందో చూడాలి.

మాస్ రాజా రవితేజ .. ఆల్రెడీ శివ, విఐ ఆనంద్, సముద్రఖని లాంటి తమిళ డైరెక్టర్స్ తో వర్క్ చేశాడు. కాకపోతే ఆ సినిమాలు అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే త్వరలో రవితేజ మరో తమిళ డైరెక్టర్ తో మరో సినిమా చేయబోతున్నట్టు టాక్. ఆ డైరెక్టర్ బాలాజీ మోహన్. ఇది వరకు తెలుగులో లవ్ ఫెయిల్యూర్ డైరెక్ట్ చేసిన ఈ డైరెక్టర్ ధనుష్ తో ‘మారి, మారి 2’ తీసి హిట్స్ కొట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత బాలాజీ మరో సినిమా చేయలేదు. ఇటీవల రవితేజ కు మంచి స్టోరీతో ఇంప్రెస్ చేశాడట. త్వరలోనే సినిమా లాంఛ్ కానున్నట్టు టాక్.

Rajamouli : రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?

తన కెరీర్ బిగినింగ్ నుంచే సందీప్ కిషన్ తమిళ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో మళ్ళీ ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. సందీప్ కిషన్ ఇదివరకు తెలుగులో ‘టైగర్’ అనే సినిమాలో నటించాడు. తమిళ డైరెక్టర్ విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈసినిమా సందీప్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందుకే ఇతడితో సందీప్ మరోసారి కలిసి వర్క్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న వెరైటీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’. హారర్ ఎలిమెంట్స్ తో కూడిన థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు.

నాగ చైతన్య తమిళ హిట్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అట్లీ కూడా తెలుగులో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. తమిళ్ మాస్ డైరెక్టర్ శివ కూడా తెలుగులో మరో సినిమా చేయడానికి చూస్తున్నాడు. ఇలా చాలా మంది తమిళ డైరెక్టర్స్ తెలుగువైపుకి చూడటంతో టాలీవుడ్ లో తమిళ తంబీల క్యూ పెరిగింది.