Manchu Lakshmi : ఇన్నేళ్ళుగా.. అదే సమస్యతో బాధపడుతున్న మంచు లక్ష్మి..

తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. (Manchu Lakshmi)

  • Published on- May 2, 2026 / 08:50 AM IST

Manchu Lakshmi

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలతో మెప్పించగా ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తూ అక్కడ నటిగా సినిమాలు, సిరీస్ ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. మంచు లక్ష్మి తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో మంచు లక్ష్మి విలన్ గా నటించింది.

తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా చేసేటప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందని, దానితో ఇప్పటికి బాధపడుతున్నాను అని తెలిపింది.

Also Read : Aamir Khan : నాకు ఏం జరిగినా నేను చనిపోయినా ఆపొద్దు.. అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అనగనగా ఓ ధీరుడు సినిమా కోసం రోజుకు మూడు గంటలు మేకప్ వేసుకునే దాన్ని. భారీ డ్రెస్ మోసేదాన్ని. మేకప్ తీసేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. ఆ మేకప్, డ్రెస్, ఆభరణాల వల్ల మెడనొప్పి వచ్చింది. అప్పుడొచ్చినా మెడనొప్పి ఇప్పటికి ఉంది. స్పాండిలైటిస్ కూడా వచ్చింది. అది ఇంకా పోలేదు. ఇప్పటికి దాంతో బాధపడుతున్నా అని తెలిపింది. 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమా వచ్చింది. అప్పట్నుంచి ఆల్మోస్ట్ 15 ఏళ్లుగా మంచు లక్ష్మి స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతుంది.