Aamir Khan : నాకు ఏం జరిగినా నేను చనిపోయినా ఆపొద్దు.. అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఒకవేళ తనకు ఏమైనా జరిగితే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Aamir Khan)
Aamir Khan
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇప్పుడు అడపాదపడా సినిమా చేస్తున్నారు. నిర్మాతగా మాత్రం సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ నిర్మాణంలో తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఏక్ దిన్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మే 1న రిలీజయింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఒకవేళ తనకు ఏమైనా జరిగితే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Jaanvi Swarup : మహేష్ బాబు మేనకోడలు.. జాన్వీ స్వరూప్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? హీరోయిన్స్ ని మించి..
అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చనిపోయినా, నాకు ఏమన్నా అయినా ఆ సినిమా ఆపకూడదు అని చెప్తా. ఏదైనా సినిమా షూటింగ్ లో విమాన ప్రయాణం చేయాల్సి వస్తే డైరెక్టర్ మన్సూర్ ఖాన్ కి ఒక నోట్ పంపిస్తా. నేను ప్రయాణం చేసే ఫ్లైట్ కూలిపోయి నాకు ఏమైనా అయితే సినిమా పనులు నువ్వే చూసుకో అని మెసేజ్ పెడతాను. నాకు ఏ ఆపద వచ్చినా సినిమా మాత్రం ఆపొద్దని, మన్సూర్ తో కలిసి సినిమా పనులు పూర్తిచేసి రిలీజ్ చేయమని నా దర్శకులకు చెప్తాను అని తెలిపారు.
అమీర్ ఖాన్, డైరెక్టర్ మన్సూర్ ఖాన్ బంధువులు అవుతారు. వీరిద్దరి కాంబోలో బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి.
Also Read : Ravibabu : ‘పెద్ది’ సినిమాపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. వస్తామంటారు రారు.. వాళ్ళ వల్ల..
