Ravibabu : ‘పెద్ది’ సినిమాపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. వస్తామంటారు రారు.. వాళ్ళ వల్ల..
సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ పెద్దిపై వ్యాఖ్యలు చేసారు.(Ravibabu)
Ravibabu
Ravibabu : రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమా వాయిదా పడి పలు డేట్స్ అనుకోని చివరకు జూన్ 4 ఫిక్స్ అయింది. పెద్ది ఏప్రిల్ 30 డేట్ మీద కూడా చాలానే చర్చ జరిగింది. పెద్ది ఉందని చాలా చిన్న సినిమాలు వాయిదా వేసుకున్నాయి. అది రావట్లేదని చివరి నిమిషంలో తెలియడంతో కొన్ని సినిమాలు వచ్చినా ఇంకొన్ని అయోమయంలో పడ్డాయి.
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రేజర్ సినిమాపై కూడా పెద్ది ఎఫెక్ట్ పడింది. రేజర్ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ పెద్దిపై వ్యాఖ్యలు చేసారు.
రవిబాబు మాట్లాడుతూ.. రేజర్ సినిమా మే 1న రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొదట. కానీ అదేదో పెద్ద సినిమా వస్తుందని భయపెట్టి మార్కెట్ అంతా హడావిడి చేసారు. అది రాదు. ఈ పెద్ద సినిమాలు అన్ని అంతే ఒక డేట్ చెప్తారు ఆ డేట్ కి రారు. వాళ్ళ వల్ల చిన్న సినిమాలు ఏమో అటు ఇటు పరిగెడతాయి.
అలా ఆ పెద్ద సినిమా వస్తుంది అన్నారు అని నేను వాయిదా వేసుకుందాం అనుకున్నా. మళ్ళీ వస్తుంది అన్నారు. మళ్ళీ రాదు అన్నారు. ఇలా ఓ 15 రోజులు జరిగింది. ఇలా అయ్యేది కాదులే అని నేనే డేట్ మార్చుకొని తర్వాత డేట్ మే 8 సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు మా నాన్న గారి పుటిన రోజు కూడా ఉంది. ఇంకా అది ఫైనల్ చేసుకున్నా అని తెలిపారు. దీంతో రవిబాబు వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.
“#RazorMovie May 1st కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత అదేదో పెద్ద సినిమా వస్తుంది అని చెప్పి భయపెట్టి హడావిడి చేశారు.
ఈ పెద్ద సినిమాలన్నీ ఇంతే.. చెప్పిన డేట్ కి రావు పెట్టవు… మిగతా చిన్న సినిమాలన్నీ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాయి..”
– Director #RaviBabu | #PEDDI pic.twitter.com/hS9eqimzdF
— Whynot Cinemas (@whynotcinemass_) May 1, 2026
Also Read : Seerat Kapoor : భారీ ఎద అందాలతో సీరత్ కపూర్.. ఫోటోలు వైరల్..
