Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..

తాజాగా మంచు లక్ష్మి ముంబైలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నాను అని ఓ వీడియో చేసింది. ముంబైలో తాను తీసుకున్న కొత్త ఇల్లుని ఈ వీడియోలో చూపించింది.

Manchu Lakshmi Shifted to Bolywood Mumbai New Home Tour Video

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురిగా, నటిగా మంచు లక్ష్మి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది మంచు లక్ష్మి. త్వరలో అగ్ని నక్షత్రం అనే సినిమాతో రాబోతుంది. మంచు లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్(Bollywood) మీద ఫోకస్ చేస్తుంది. తాజాగా తన మకాం ముంబైకి(Mumbai) మార్చేసింది. కొన్ని నెలల క్రితమే ముంబైకి వెళ్ళిపోయింది. అయితే కొన్ని రోజులు అక్కడికి – ఇక్కడికి ట్రావెల్ చేసిన లక్ష్మి ఇప్పుడు పూర్తిగా షిఫ్ట్ అయింది.

తాజాగా మంచు లక్ష్మి ముంబైలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నాను అని ఓ వీడియో చేసింది. ముంబైలో తాను తీసుకున్న కొత్త ఇల్లుని ఈ వీడియోలో చూపించింది. ముంబై హౌస్ హోమ్ టూర్ అంటూ ఆ ఇంటి గురించి చెప్పింది. ముంబైలో దాదాపు 28 ఇల్లులు చూసాక ఈ ఇల్లు నచ్చినదని తెలిపింది. మంచు లక్ష్మి ముంబై కొత్తింట్లో పెద్ద హాల్, మూడు బెడ్ రూమ్స్, చిన్న పిల్లలకు ఇంకో బెడ్ రూమ్, కిచెన్, బాల్కనీ, మేకప్ రూమ్, బాత్రూమ్స్.. ఇలా అన్ని లగ్జరీగా ఉన్నాయి. ఇక ఈ ఇంట్లోకి కావాల్సిన సామాను కొంత ముంబైలో కొనుక్కొని, కొంత హైదరాబాద్ తన ఇంటి నుండి షిఫ్ట్ చేసుకున్నట్టు తెలిపింది.

Also Read : Brahmanandam : బ్రహ్మానందం మొదటి సంపాదన ఎన్ని రూపాయలు తెలుసా? లారీలకు పెయింట్స్ వేసి..

ఇక ముంబైలో బాలీవుడ్ హీరోయిన్స్ తో కలిసి జిమ్ లకు, పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టింది. త్వరలో బాలీవుడ్ ఛాన్సులు పట్టేసి అక్కడ వెబ్ సిరీస్ లలో బిజీ అవ్వాలని చూస్తుంది. ఇలా నటనపై ఫోకస్ చేస్తూనే మరో వైపు తన సేవా సంస్థ టీచ్ ఫర్ చేంజ్ తో పలు సేవా కార్యక్రమాన్ని కూడా చూసుకుంటుంది.