×
Ad

Manchu Manoj : రామ్‌చరణ్ అతిధిగా వచ్చిన సినిమా ఆగిపోయింది.. ఆ దర్శకుడు వైష్ణవ్‌ తేజ్‌తో!

రామ్ చరణ్ అతిధిగా మంచు మనోజ్ సినిమా అహం బ్రహ్మాస్మి ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ మధ్యలో ఆగిపోవడం, ఆ డైరెక్టర్ వైష్ణవ్‌ తేజ్‌ తో సినిమా మొదలు పెట్టడం..

  • Published On : April 19, 2023 / 09:36 PM IST

Manchu Manoj about Aham Brahmasmi movie

Manchu Manoj : మంచు వారసుడు మనోజ్ చివరిగా చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు(Okkadu Migiladu) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సందడి చేశాడు. ఇక 2020 లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని ఒకే చేశాడు. ఈ మూవీ ఓపెనింగ్ ని రామ్ చరణ్ (Ram Charan) చేతులు మీదగా గ్రాండ్ గా నిర్వహించాడు మనోజ్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాని తెరకెక్కించబోయాడు. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా దీని గురించి మనోజ్ మాట్లాడాడు.

Manchu Manoj – Bhuma Mounika : పెళ్లి కాకముందు మౌనికని మోహన్ బాబు అలా ట్రీట్ చేసేవారు.. ఇప్పుడు!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోకి మంచు మనోజ్ తన భార్య మౌనిక కలిసి హాజరయ్యాడు. ఈ షోలో మనోజ్ ని అహం బ్రహ్మాస్మి సినిమా ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా, మనోజ్ బదులిస్తూ.. “ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే మౌనిక నేను కలిసి జీవిద్దాం అని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంతో చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వచ్చింది. నా కోసం ఒక బిడ్డతో ఎదురు చూస్తున్న ఆమె కోసం సినిమాని వదిలేసి వెళ్లడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనబడలేదు. దీంతో అహం బ్రహ్మాస్మిని మధ్యలో వదిలేసి వెళ్లాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Manchu Manoj – Bhuma Mounika : వాళ్ళిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.. మంచు మనోజ్!

ఆ సినిమా ఓపెనింగ్ కి తన మిత్రుడు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా వచ్చాడని గుర్తు చేసుకున్న మనోజ్.. ఆ సినిమా కోసం రెండేళ్ల పాటు కష్టపడినట్లు, సినిమాని నిలిపివేసినందుకు దర్శకుడు శ్రీకాంత్ కి క్షమాపణలు చెప్పినట్లు కూడా తెలియజేశాడు. అలాగే ప్రస్తుతం శ్రీకాంత్, మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) #PVT04 సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. అహం బ్రహ్మాస్మి సినిమాని కూడా త్వరలో పట్టాలు ఎక్కిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.